చెరువులో పడి వ్యక్తి మృతి
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల చెరువులో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం తేలింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది SFO రాజేందర్, LFF లక్ష్మీకాంత్ రెడ్డి, FFT సురేష్, FF నవీన్ కుమార్, FF ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావాలి గణపతి (45)గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.