ఫామ్ హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం

SDPT: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్ హౌస్‌కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.