డుంబ్రిగూడలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు

డుంబ్రిగూడలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు

ASR: డుంబ్రిగూడలో శుక్రవారం వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీను నిర్వహించారు. ఉపాధ్యాయులు, పలు కార్యాలయాల సిబ్బంది పాల్గొని దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ వందేమాతరం గేయం ప్రాముఖ్యతను వివరించారు.