బైక్, కారు ఢీ..కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
MNCL: మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్, కారు ఢీ కొని హాజీపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బుద్దె శేఖర్ తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి, క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.