వైసీపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

వైసీపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలానికి చెందిన YCP నేత, రాష్ట్ర ST సెల్ జాయింట్ సెక్రెటరీ గోపాల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి కత్తులతో గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసారన్నారు. ఈ దాడిలో గాయపడిన గోపాల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.