కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు BRS సర్పంచులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు BRS సర్పంచులు

ASF: బెజ్జూర్ మండలం ఊట్ సారంగపల్లి సర్పంచ్ శ్రీహరి, లంబడి గూడ సర్పంచ్ ధరావత్ కవిత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్‌లోని MLC దండే విఠల్ నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని, పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.