బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

KMM: సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం జరిగింది. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన బానోత్ సంతు తన బైక్ పై క్రాస్ రోడ్ వైపు వెళ్తున్నాడు. రోడ్డు మధ్యలో ఉన్న గుంటను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో సంతు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.