'చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి'
PPM: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ధాన్యం రాకపోకలు, చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బంది, మిల్లర్లపై ఉందని, ధాన్యం నాణ్యత ఆధారంగా రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలిపారు. ఆయన వీరఘట్టం మండలం నడింకెళ్ళను పరిశీలించారు.