సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
NLG: మిర్యాలగూడలోని దుబ్బతండ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.