ఫిరంగిపురం విజ్ఞానపురంలో ప్రత్యేక ఫీవర్ సర్వే

GNTR: ఫిరంగిపురంలోని విజ్ఞాన పురం ప్రాంతంలో గురువారం ఫిరంగిపురం పిహెచ్సి ఆధ్వర్యంలో స్పెషల్ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ అబ్దుల్ రెహమాన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి ప్రతి ఇంటిని సందర్శించారు. ప్రజలను కలుసుకుని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు వంటి వ్యాధుల లక్షణాలు ఉన్నాయా లేదా అని విచారించారు.