ప్రజల చెంతకే న్యాయం: జడ్జి
KDP: మారు మూల గ్రామీణ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన వాహనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవల్ని ప్రజలకు గడప చెంతనే అందించేందుకు మొబైల్ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.