'సొంత ఇల్లు కల నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

'సొంత ఇల్లు కల నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ లోని నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మేయర్ మధుకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా చేస్తామన్నారు.