యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

కడప: యోగివేమన యూనివర్సిటీలో సుల్తానా అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.