ఓటరు జాబితా సవరణపై కలెక్టర్ దృష్టి
ASF: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఇవాళ కాగజ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయం స్థాపన కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించి, ఫారాలు 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.