రైతులకు నష్టపరిహారం చెక్కులు అందజేత

రైతులకు నష్టపరిహారం చెక్కులు అందజేత

NRPT: మక్తల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం భూములిచ్చిన ఏడుగురు రైతులకు మంత్రి వాకిటి శ్రీహరి రూ.2.88 కోట్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఎకరాకు రూ.14 లక్షల చొప్పున చెల్లిస్తూ గొల్లపల్లి వద్ద 25 ఎకరాల సేకరణ పూర్తి చేశారు. సీఎం సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.