వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాల జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు అర్హులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి కోచ్, PED చేసిన వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణంలో రూ.7,500 అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 99635 39234 నంబర్‌ను సంప్రదించాలన్నారు.