VIDEO: గేట్‌వాల్ గుంతలో పడి వృద్ధుడు మృతి
WGL: సంగెం మండలంలో హిత గ్రామంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఆదివారం సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి వాటర్ ట్యాంక్ గేట్‌వాల్ గుంతలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు చూసి అతన్ని గుంత నుంచి బయటకు తీశారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాల కోసం విచారిస్తున్నారు.