బాలికపై అత్యాచారం.. దోషికి జీవితఖైదు

RR: బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2022లో 9 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ షేక్ సలీమ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కోర్టు సలీమ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 55 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.