బడ్జెట్‌లో హంద్రీనీవాకు అత్యధిక ప్రాధాన్యం

ATP: కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కరువు జిల్లాపై కరుణ చూపారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించారు.