హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన హత్య కేసులో ముద్దాయి నాయక్ దీపక్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ కాలనీకి చెందిన హరికృష్ణను మద్యం, డబ్బుల వివాదం కారణంగా చాకుతో పొడిచి చంపాడు. ఏలూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. సత్యనారాయణ, రూరల్ SI బి.నాగబాబు బృందం అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి చాకును స్వాధీనం చేసుకున్నారు.