అకస్మాత్తుగా మంటలు.. కారు దగ్దం
KNR: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామ శివారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.