నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కోనసీమ: నేడు అమలాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు.