VIDEO: విద్యార్థులను చితకబాదిన టీచర్
మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ పాఠశాలలో ఋషి కుమార్, బ్లేస్సీ, అక్షిత్, అశ్విత్ అనే విద్యార్థులను చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డి. శ్రీకాంత్, తిరుపతి సోమవారం పాఠశాలకు వెళ్లి నిరసన చేపట్టారు. విద్యార్థులను తీవ్రంగా కొట్టిన ఇంగ్లీష్ టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.