వట్టిచెరుకూరులో అక్రమ మద్యం పట్టివేత
GNTR: వట్టిచెరుకూరు (M) చమల్లామూడి ఎస్సీ కాలనీలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓ బడ్డీ కొట్టులో మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు ఆదివారం ఆకస్మిక దాడి చేసినట్లు తెలిపారు. నిర్వాహకుడు రాయపాటి శివను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 92 క్వార్టర్ బాటిళ్లు, ఒక ఫుల్ బాటిల్ (మొత్తం 17.31 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు.