VIDEO: పశువైద్య అధికారి నిర్లక్ష్యం.. ఇబ్బంది పడిన ప్రజలు
KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హెచ్చరించినా, ఖాజీపేట పశువైద్యాధికారి లక్ష్మణ్ తీరు మారలేదు. ఇవాళ ఉదయం వైద్యశాల ఆలస్యంగా తెరవడం, అధికారి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో సుంకేసుల రైతులు ఇబ్బంది పడినట్లు తెలిపారు. లంపీ వైరస్ తో పశువులు నరకయాతన పడుతున్నా స్పందించని అధికారిని తప్పించాలని వారు డీ.ఎస్. చంద్రభాస్కర్ రెడ్డిని కోరారు.