జాతీయ రికార్డులకెక్కిన రాయదుర్గం విద్యార్థులు
ATP: రాయదుర్గం పట్టణంలోని కళ్ళి మఠం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన "బేబీ బోర్వెల్ రెస్క్యూ మెషీన్" ప్రాజెక్ట్ ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సైన్స్ సమగ్ర మహోత్సవం-2K26లో జిల్లా స్థాయిలో మొదటి, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించిన విద్యార్థులను యువ నాయకులు కాలవ భరత్ ఘనంగా సన్మానించారు.