250 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం

SRD: హత్నూర మండలం గోవిందరాజు పల్లి శివారులోని డైరీ ఫామ్‌లో 250 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో కల్తీ నెయ్యి పట్టుబడినట్లు పేర్కొన్నారు. నెయ్యిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. డైరీ ఫామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.