'నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి'

అన్నమయ్య: GNSS- HNS అనుసంధాన పైప్ లైన్ పథకం నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ముందు GNSS- HNS అనుసంధాన పైప్ లైన్ ప్రాజెక్ట్ నిర్వాసితులైన రైతులతో కలసి ధర్నా నిర్వహించారు.