ఛార్జింగ్‌లో ఉండగా పేలిన ఫోన్.. తప్పిన ప్రమాదం
చైనాకు చెందిన ఓ చిన్నారి సోఫాలో కూర్చుని ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను వాడుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ బాలిక భయంతో వెంటనే అక్కడి నుంచి పక్కకు దూకేసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది.