మంత్రిని కలిసిన బొడ్మట్‌పల్లి నూతన సర్పంచ్‌.!

మంత్రిని కలిసిన బొడ్మట్‌పల్లి నూతన సర్పంచ్‌.!

MDK: టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తలారి అవినాష్ విజయం సాధించారు. ప్రత్యర్థులపై 346 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన ఆయన శుక్రవారం తన పార్టీ నేతలు, అనుచరులతో కలిసి సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సర్పంచ్ అవినాష్‌ను అభినందించి, శాలువాతో సన్మానించారు.