రష్యా విక్టరీ డే వేడుకలు.. రాజ్‌నాథ్ దూరం!

రష్యా విక్టరీ డే వేడుకలు.. రాజ్‌నాథ్ దూరం!

మే 9న జరగనున్న రష్యా విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. తొలుత ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ప్రకటన వచ్చింది. కానీ, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను ప్రధాని విరమించుకున్నారు. ఆయన స్థానంలో రాజ్‌నాథ్ వెళ్లాల్సి ఉండగా.. తాజాగా ఆయన కూడా వెళ్లట్లేదని సమాచారం. రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్‌ను పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.