రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

NLG: మునుగోడు(M) ఊకొండిలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి(20), మర్రి శివకుమార్(21) శుక్రవారం రాత్రి ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి ఢీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు SI రవి సందర్శించి కేసు నమోదు చేశారు.