మోదీనే భయపడుతున్నారు: రాహుల్ గాంధీ
ప్రజలను భయపడవద్దని చెబుతున్న ప్రధాని మోదీ, నిజానికి ఆయనే తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అదానీ కేసు, ఎప్‌స్టెయిన్ వంటి అంశాల వల్ల మోదీ భయపడుతున్నారని, అందుకే పార్లమెంట్ సభలోకి రావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న మోదీ కుర్చీ ఖాళీగా ఉండటమే దీనికి నిదర్శనమని, దేశానికి ధైర్యం చెప్పే ముందు మోదీ తన భయాన్ని పోగొట్టుకోవాలని రాహుల్ హితవు పలికారు.