VIDEO: రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలి:బిజెపి

WNP: రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన సన్నవడ్ల బోనస్ డబ్బులు రైతుల ఖాతాలలో జమచేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మదనాపురం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. 4నెలలు గడుస్తున్న బోనస్ డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని MROకు వినతిపత్రం ఇచ్చారు.