'రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి'
ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని DAO వెంకట్ మంగళవారం సూచించారు. పెట్టుబడి సాయం అందుకునేందుకు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో పాటు దరఖాస్తు ఫారం పూర్తి చేసి తమ మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సమర్పించాలని రైతులకు తెలిపారు.