మలికిపురం డిప్యూటీ ఎంపీడీవోగా సూరపురాజు

మలికిపురం డిప్యూటీ ఎంపీడీవోగా సూరపురాజు

కోనసీమ: మలికిపురం డిప్యూటీ ఎంపీడీవో రుద్రరాజు సూరపు రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన కామనగరువు, బండారులంక, పేరూరు పంచాయతీలకు కార్యదర్శిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఆయనను పలువురు అభినందించారు.