'ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి'
MBNR: బాలానగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీవో విజయ కుమారి మాట్లాడుతూ.. ఈరోజు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. మండలంలోని 37 గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులను ప్రజావాణిలో తెలపాలని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.