VIDEO: పోచమ్మ ఆలయం, ముదిరాజ్ సంఘ భవనానికి భూమిపూజ
WGL: గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో శుక్రవారం పోచమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణం మరియు ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూజలు నిర్వహించి, గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక, సామాజిక వర్గాల సంక్షేమానికి సమూహ భవనాల అవసరాన్ని ప్రత్యేకంగా వివరించారు.