అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే
యాదాద్రి: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారు. నారాయణ పూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వాములందరూ అయ్యప్ప అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు.