ఘనంగా అబుల్ కలాం జయంతి
KMR: భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం జయంతి సందర్భంగా ఇవాళ KMR కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయన విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొన్నారు.