'రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు'

WNP: రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో కలిసి వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.