'ప్రతిరోజు కిన్నెరసాని నీళ్లు అందించాలి'

'ప్రతిరోజు కిన్నెరసాని నీళ్లు అందించాలి'

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజలు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బిందెలతో నిరసన తెలిపారు. గత వారం రోజులుగా కిన్నెరసాని మంచినీరు రాకపోవడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతిరోజు కిన్నెరసాని నీరు వచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు.