అమ్మవారికి సర్వాంగ వెండి కవచాల అలంకరణ

అమ్మవారికి సర్వాంగ వెండి కవచాల అలంకరణ

WGL: నగరంలోని భద్రకాళి అమ్మవారు సర్వాంగ వెండి కవచాల అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. దాత పుట్టారెడ్డి దీప్తిశ్రీ సమర్పించిన 111 కిలోల వెండి కవచం, మాంగల్యాలను అమ్మవారికి అలంకరించారు. వెండి వెలుగుల్లో మెరిసిపోతున్న అమ్మవారిని చూసి భక్తులు పరవశించగా, ఈ సందర్భంగా ఈవో సునీత, ధర్మకర్తలు దాతలకు శేషవస్త్రాలు కప్పి ప్రసాదం అందజేశారు.