నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం: నాని

తిరుపతి: తిరుపతి రూరల్ మండల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.