ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సెర్చ్: ఏసీపీ దామోదర్
ఎన్టీఆర్: విజయవాడ వైయస్సార్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో వాహనాలు, గృహాలు తనిఖీలు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నంబర్ ప్లేట్ లేని వాళ్ళ వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు రక్షణ కోసమే కాటన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు.