గణేష్ మండపాల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: కలెక్టర్

KMM: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. అలాగే గణేష్ ఉత్సవకమిటీ సభ్యుల పేర్లు అధికారులకు అందించాలని పేర్కొన్నారు.