పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశం

పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశం

కృష్ణా: టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ సంస్థాగత ఎన్నికలను మే 15 నాటికి పూర్తి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. ఇబ్రహీంపట్నంలో పార్టీ శ్రేణులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న సీఎంకి అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.