గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిమిడిదపాడు స్వర్ణ గ్రామాల మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గేదె రోడ్డుపై అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం బలంగా దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె, ఉపాధ్యాయుడు మృతి చెందారు.