నగరంలో పాప కనిపించకపోవడం కలకలం

నగరంలో పాప కనిపించకపోవడం కలకలం

కరీంనగర్ విజయపురి కాలనీలో ఓ పాప కనిపించకపోవడం కలకలం రేపింది. ఇంట్లో తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటూ బయటికి వచ్చిన వికిత (5) అనే పాప కనిపించకపోవడంతో, డయల్ 100 కు కాల్ చేశారు. కానిస్టేబుల్ ఏ శ్రీనివాస్, హోంగార్డ్ పీ. క్రాంతి కుమార్ ఘటన స్థలానికి చేరుకొని, ఆడుకుంటూ పక్క కాలనీలోకి వెళ్లిన పాపను గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పజెప్పారు.