'ఉపాధి అవకతవకల అధికారులపై చర్యలు'
GDWL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకల అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం ఉండవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో 2024 -25 పనులు సంబంధించిన దానిపై సొసైటీ సామాజిక తనిఖీ బృందం ప్రజా వేదిక ద్వారా జరిగిన పనులపై విచారణ చేపట్టారు.